గూడూరు, మన న్యూస్ :- వందే భారత్ ట్రైన్ గూడూరు స్టేషన్ నందు కూడా నిలుపుదల చేయాలని అధికారులను కోరియున్నాము- శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా నడుపుతున్న వందే భారత్ ట్రైన్ చాలా త్వరగా ప్రజలను చేరుస్తుంది. దీనివలన ఉద్యోగస్థులు సకాలంలో వారి వృత్తులకు హాజరు అవుతున్నారు. అలాగే గూడూరు నుండి దూర ప్రాంతాలకు ఎంతో మంది ప్రయాణిస్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ కింద హాస్పిటల్స్ కు వెళ్లాలంటే మిగతా ట్రైన్ లలో ఇబ్బందిగాను మరియు సకాలంలో చేరుకోలేక పోతున్నారు. అలాగే వ్యాపారస్థులు ఇక్కడ నుండి చాలా మంది వారి వ్యాపార దృష్ట్యా ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. తిరుపతి నుండి సికింద్రాబాద్ కు మరియు తిరుపతి నుండి విజయవాడ కు వెళ్లే వందే భారత్ ట్రైన్ ను గూడూరు జంక్షన్ నందు నిలుపుదల చేయాలనీ పై అధికారులకు తెలిపయున్నాను. వారు ఈ విషయమై త్వరలో స్పందించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారని అన్నారు.