
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.లక్ష్మీ తులసి సమక్షంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ తులసి మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాలు వెన్న శ్రీనివాసరావు ఇక్కడే పని చేసి 2021 వ సంవత్సరంలో న్యూఢిల్లీలో వినూతన బోధనల ఉపాధ్యాయ అవార్డు గ్రహీత,2022వ ఈ సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, పాఠశాల ఇంచార్జ్ గా కూడా పనిచేసిన ఘనత వెన్న శ్రీనివాసుదని ఆమె కొనియాడారు.అనంతరం ఉపాధ్యాయులు మువ్వల లోవ ప్రసాద్,వనమా శ్రీరామ్,ముప్పిడి చినబాబు మాట్లాడుతూ వెన్న శ్రీనివాసరావు పాఠశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు.బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు వెన్న శ్రీనివాసరావు, బి రామకృష్ణ,పి రామకృష్ణ, పి సత్యకుమారి, డీఎ రాజశేఖర్,బి. స్వరూప, ఏ సూరన్న దొర,కె. విద్యాలక్ష్మి, జి నాగేశ్వరావు, ఎం విజయలక్ష్మి, ఎం గంగా భవాని, ఎంఆర్పి మనోహర్, జీవి పద్మ కుమారి, ఎస్కే రబ్బాని, సిహెచ్ వీరబాబులను ప్రధానోపాధ్యాయురాలు ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.