

గూడూరు, మన న్యూస్ :- జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆద్వర్యం లో ఈనెల 17 వ తేదీ విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో నిర్వహించబోయే జాతీయ బీసీ మహా సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ లు తరలిరావాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పెరుమాళ్ళ పద్మజ యాదవ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మయూరి శ్యామ్ యాదవ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుచూ *బీసీ లకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని,స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా రిజర్వేషన్ల లో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, కేంద్రం లో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ లకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని,విద్యా ఉద్యోగాలలో మేము ఎంతో మాకు అంత రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణన లో కులగణన చేపట్టి బీసీ జనాభా తేల్చాలని అన్నారు.జాతీయ మహాసభ కార్యక్రమానికి బిసి ప్రముఖులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కె.రామ్మోహన్ నాయుడు గారు, నేషనల్ బిసి కమీషన్ చైర్మెన్ శ్రీ హన్సరాజ్ గంగారాం అహీర్ , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు , రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పి.వి.యన్ మాధవ్ గారు, రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు , రాష్ట్ర గనులు మరియు ఎక్సైజ్ శాఖా మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కోలుసు పార్థసారథి యాదవ్ గారు, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి యస్ సవిత గారు, రాష్ట్ర యమ్.యస్.యమ్.ఇ శాఖ మాత్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, రాజ్య సభ సభ్యులు శ్రీ డాక్టర్ బీద మస్తాన్ రావు యాదవ్ గారు ,జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు గారు మరియు బిసి నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. కావున ఈకార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బిసి నాయకులు విచ్చేసి జయప్రదం చేయాలని పెరుమాళ్ళ పద్మజ యాదవ్ మరియు మయూరి శ్యామ్ యాదవ్ వక ప్రకటనలో తెలిపారు….