చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవర్చుకోవాలి-సీఐ ఎన్.కిషోర్ బాబు

సెల్ఫోన్ భూతానికి దూరంగా ఉండి చదువులపై శ్రద్ధ చూపండి– లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో ఇన్వెస్టిట్యూర్ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ ఎన్.కిషోర్ బాబు

గూడూరు మన న్యూస్:- , చిన్నతనం నుండే విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవడం వలన చదువుల్లో రాణించడంతోపాటు సమాజంలో ఎంతో గౌరవ,మర్యాదలు పొందేందుకు వీలుగా ఉంటుందని గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.కిషోర్ బాబు విద్యార్థులకు సూచించారు.మంగళవారం గూడూరు పట్టణ సమీపంలోని లిటిల్ ఏంజెల్స్ పబ్లిక్ పాఠశాలలో విద్యార్థుల ఎన్నికలలో గెలుపొందిన విద్యార్థులకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐ కిషోర్ బాబు విద్యార్థులకు ముందుగా అభినందనలు తెలిపి వారికి ఎన్నికలలో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బ్యాడ్జీలు అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థినీ,విద్యార్థులు చిన్నతనం నుండి ఎక్కువ శాతం సెల్ఫోన్లకు అలవాటు పడి ఎంతో నష్టపోతున్నారన్న సంగతిని గ్రహించాలన్నారు. సెల్ఫోన్ కు దూరంగా ఉండడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని ముఖ్యంగా చదువులు పై శ్రద్ధ చూపడంతో పాటు క్రీడలు పట్ల కూడా ఆసక్తి కనబరచడం జరుగుతుందన్నారు. ఎన్నికలలో విజయం సాధించిన లీడర్లు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే అవి ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.అంతేకాకుండా అతి ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే సులువైన రీతిలో పాఠాలు బోధించడంతోపాటు విలువలు సాంప్రదాయాలు కూడా చిన్నతనం నుండే విద్యార్థులకు నేర్పించే విధంగా శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. లిటిల్ ఎంజెల్స్ పాఠశాల అంటే ఎంతో ప్రశాంత వాతావరణంలో,ఉన్నత విలువలతో కూడిన పాఠశాలగా పేరుందని తెలిసిందన్నారు.40 ఏళ్లుగా పాఠశాలలో ఎంతో మంచి విద్యను విద్యార్థులకు అందిస్తున్న పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. అనంతరం సీబీఎస్సీ విభాగంలో ఎస్పీఎల్ చక్రేష్ కుమార్ యాదవ్, హౌస్ కెప్టన్స్ డార్జిలింగ్ రైడర్స్ ఎంవిఎస్కే కార్తికేయ, మైటీ వారియర్స్ డీ.ధార్వి , పవర్ రాకర్స్ ఎన్ దామోదర్, స్టేట్ బోర్డ్ విభాగంలో ఎస్పిఎల్ ఇ.యేనోశ్,హౌస్ కెప్టన్స్ డార్జిలింగ్ రైడర్స్ సిహెచ్.చైతన్య దీపక్,మైటీ వారియర్ ఎం హన్సిక,పవర్ రాకర్స్ ఓ.గురు బాలాజీ లను సీఐ కిషోర్ బాబు బ్యాడ్జీలు వేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బస్సా రెడ్డి శ్రీకాంత్ రెడ్డి,అకాడమిక్ డైరెక్టర్ సుధేష్ణ,దయాకర్, హెడ్మాస్టర్ సురేష్ వైస్ ప్రిన్సిపల్ నంద,ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..