

రాయదుర్గం, మన న్యూస్ : నియోజకవర్గంలోని కూటమి సుపరిపాలన తొలి అడుగులో భాగంగా, కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యంగ్ డైనమిక్ లీడర్ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు తో కలసి ప్రారంభించారు మంత్రిపయ్యావుల కేశవ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేశారు ప్రజలు గజ మాలతో సత్కరించారు..ఈ ముఖ్య కార్యక్రమానికి వైద్య శాఖా మాత్యులు సత్య కుమార్ యాదవ్ డుమ్మా కొట్టారు. ఆలాగే మంత్రులు టీ జీ భరత్, బీసి జనార్ధన్ రెడ్డి, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ లు సైతం డుమ్మా కొట్టారు.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపట్ల అసహనం వ్యక్తం చేసిన సంగతులు తెలిసిందే. ప్రభుత్వ పథకాల ప్రచారానికి మంత్రులు దూరమా? లేక భారమా అనే విమర్శలు ప్రజలు గుప్పిస్తున్నారు.ఇక మరో విషయం కూటమినాయకులు, కార్యకర్తలు సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమంలో గైర్హాజరీ అవుతున్నారనేది స్పష్టమవుతుంది.
ప్రజలకు సుపరిపాలనఅందించే సంకల్పంతోముఖ్యమంత్రి పెద్ద బాబు, చిన్న బాబులు, తండ్రి కుమారులు కష్ట పడుతుండగా మిగతా నేతలు కష్ట పెడుతున్నారు. కష్టాలు ఒకరివి సుఖాలుమరొకరివా అని జిల్లా ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.