

మన న్యూస్,తిరుపతి, :– గురు పౌర్ణమి పురస్కరించుకొని కొంకా వీధిలోని శిరిడి సాయిబాబాను దర్శించుకోవడం వల్ల ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం గురుపౌర్ణమి ని పురస్కరించుకొని కొంకా వీధిలోని శిరిడి సాయిబాబాను భువన్ కుమార్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు వీరికి ప్రత్యేక దర్శనం తో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల భువన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ షిరిడి బాబాను దర్శించుకోవడం వల్ల అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి అని, నిష్ఠతో ఏ పని చేసినా ఆ బాబా దయతో నెరవేరుతాయి అన్నారు. భక్తులకు ప్రసాదాన్ని భువన్ కుమార్ రెడ్డి దంపతులు వితరణ చేశారు.