గూడూరు, మన న్యూస్ గూడూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా 7వ రోజు..విందూరు గ్రామం నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమల గురించి ప్రజలకు వివరిస్తూ సూపరిపాలన కరపత్రం అందిస్తున్న….డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారు శాసన సభ్యులుMGNREGS నిధులతో 10 లక్షల రూపాయలతో నిర్మించిన CC రోడ్ ప్రారంభం మరియు 5 లక్షల రూపాయలతో నిర్మించిన స్మశాన వాటిక ప్రహరీ గోడను ప్రారంభించారు.గతంలో పంచాయతీ లో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరే ప్రభుత్వం చేయలేదు అన్నారు.ఎన్టీఆర్ భరోసా పింఛన్, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలకు వివరించారు. అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంను కూటమి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *