

ఉరవకొండ మన న్యూస్ జులై 6: ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ఉరవకొండ పర్యటన వివరాలు మొదట ఉరవకొండ పట్టణం తాగునీటికి సంబంధించి పిఏబిఆర్ లో పంప్ హౌస్ సందర్శన చేసి,ఉరవకొండ ఆర్.డబ్ల్యూ.ఎస్ కార్యాలయంలో ఉదయం 09:30 గంటల నుంచి 10 గంటల మధ్య తాగునీటి పథకం ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రివర్యులు పాల్గొననున్నారు.అనంతరం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు ఎదురుగా ఉన్న ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు కోసం స్థల పరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత నూతనంగా మంజూరైన 1.రాయంపల్లి రోడ్డు, 2.పాల్తూరు రోడ్డు,
3.కనేకల్ క్రాస్ నుంచి ఉరవకొండ టౌన్ రోడ్డులకు భూమి పూజ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి..