
మన న్యూస్,నెల్లూరు:వెటర్నరీ ఆఫీసర్ యడవల్లి మల్లికార్జున జూన్ 30 న ఉద్యోగ విరమణ చేయడంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ జూనియర్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడి గా బుధవారం రాష్ట్రనాయకులు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి ఆయనస్థానంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకొన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న యం శీనయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.ఈకార్యక్రమం రాష్ట్ర ఛైర్మెన్ పార్థసారథి సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.సందర్భంగా AO NGVF నూతన ప్రెసిడెంట్ గా ఎన్నికైన శీనయ్య తనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్న యూనియన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
