

మన న్యూస్,రేణిగుంట: డెంగ్యూ వ్యాధితో భయం వద్దు అని తారకరామా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రెడ్డివారి శ్రీ లక్ష్మి తెలియజేశారు. డెంగ్యూ వ్యాధి మాసో త్సవాలు సందర్భంగా కృష్ణాపురం స్కూల్ విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ ఏ. డి.స్. ఈజిప్ట్ దోమ పగటి పూట కుడితే ఈ వ్యాధి వస్తుంది అన్నారు.
సాధారణంగా దోమ కాటుకు గురైన 2,7 రోజుల తర్వాత డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఈ లక్షణాలు 7 ,10 రోజులు వరకు ఉంటాయన్నారు. డెంగ్యూ రాకుండా జాగ్రత్తలు పడడం ఉత్తమం. దోమలు కు ట్టు కుండా చూసుకుంటే డెంగ్యూ జ్వరం రాకుండా చూసుకోవచ్చు అని తెలియజేశారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు డెంగు వ్యాధి లక్షణాలు జ్వరం వస్తుందన్నారు. కానీ అది వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించదన్నారు. డెంగ్యూ జ్వరం తలనొప్పి , దద్దుర్లు, శరీరం అంతా నొప్పిని కలిగిస్తుందన్నారు.అలాగే క్రమం తప్పకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే పూల ,కుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని దోమల నివారణకు వేపాకు ఉపయోగించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం. రేవతి, ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.