

మన న్యూస్, తిరుపతి:– స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహాపురుషులని ఆయన జీవితం అందరికీ ఆదర్శమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం అన్నారు. శుక్రవారం స్వామి వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో భారీ గజమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త
అన్నారు. తన వాగ్దాటితో దేశంలోని యువతను చైతన్య పరచడంలో ఆయనకు ఆయనే సాటి అని వివరించారు. వేదాంత తత్వాన్ని ఆయన దశదిశల వ్యాపింప చేశాడు,ఆయన భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన సేవలకు గుర్తింపుగా 1984లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవం గా ప్రకటించిందని గుర్తు చేశారు. నేటి యువతరం ఆయనను ఆదర్శంగా తీసుకుని దేశ సేవకు అంకితం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఎం ప్రసాద్, జనార్ధన్, కస్పా పద్మనాభం టీ మోహన్, పెంచలయ్య ధర్మారెడ్డి, వెంకటరాముడు రామచంద్రయ్య శాంబోలా హరినాథ్ తదితరులు పాల్గొన్నారు