

Mana News, బాపట్ల :- “సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు “సమీక్ష సమావేశం ” నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రు మాట్లాడుతూ :- ఇంటింటికీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో బూత్ ఇన్ ఛార్జిలదే కీలక పాత్ర అని అన్నారు. బాపట్ల నియోజకవర్గంలలో 202 బూత్ ల పరిధిలో విస్తృతంగా కార్యక్రమం జరగాలన్నారు. రోజుకు ఒక్కొక్క బూత్ ఇన్ ఛార్జ్ 50 ఇళ్లకు వెళ్లాలి ప్రతి ఇంటి వద్ద 2 నుంచి 3నిమిషాల సమయం కేటాయించాలని అన్నారు.ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను యాప్ లో అప్ లోడ్ చేయాలి. పార్టీ ప్రతి ఒక్క అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. పాత-కొత్త వారిని కలుపుకుని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. ఏడాదిలో ఏం చేశాం.. ఏం చేయబోతున్నామనేది ప్రజలకు వివరించాలని అన్నారు. ఇందులో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు కూడా పరిష్కారం కావాలిని అన్నారు. గత ఐదేళ్ల జరిగిన విధ్వంసం గురించి కూడా ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివ సాంబి రెడ్డి,బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, కర్లపాలెం మండల పార్టీ అధ్యక్షులు ఏపూరి భూపతిరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
