

మన న్యూస్ సాలూరు జూలై 1 :- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన ఓ మహిళ వద్ద 120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిబ్బందికి అందిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం పట్టణంలో ఉన్న ఎరుకల వీధిలో ఓ మహిళ వద్ద 120 సారా ప్యాకెట్లు విక్రయిస్తుండగా ఎక్సైజ్ సిబ్బందికి పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న సారా పెకట్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామని ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గులిపిల్లి దాస్ స్థానిక విలేకరులకు తెలియజేశారు. ఈ ధాడిలో ఇన్స్పెక్టర్ పి అప్పలరాజు, హెడ్ కానిస్టేబుల్ చిన్నం నాయుడు, బి కామేశ్వరరావు తదితర సిబ్బంది పాల్గొన్నామని తెలిపారు.