• సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- రైతులను అన్ని విధాల ఆదుకుంటాం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. బుధవారం గంగాధర నెల్లూరు ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు కావాలన్నా రాయితీ తో అందిస్తాము రైతులకు ఏ అవసరం వచ్చినా నాకు తెలియజేస్తే వాటిని పరిష్కారాన్ని కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో 977 చిన్న సన్న కారు రైతులకు వ్యవసాయ పరికరాల సరఫరా రాయితీ నిధులు ఒక కోటి 67 లక్షల 95,000 వేల సబ్సిడీ యంత్ర పరికరాలను రాయితీతో పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం సబ్సిడీ యంత్ర పరికరాలను రైతులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ ఎంపీడీవో కృష్ణ మహేశ్వర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు స్వామి దాసు నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి రాజేంద్రన్, కృష్ణమనాయుడు దేవసుందరం జ్యోతి యాదవ్ చెంగల్రాయ యాదవ్ నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ దసరాజూ మండలాధికారులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *