• వైసిపి నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్
  • ఏడాది లోనే నాలుగు గ్యారంటీలు పూర్తి చేశాం ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- తల్లికి వందనం పై దుష్ప్రచారం చేస్తే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి నాయకులు తల్లికి వందనం పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి నాయకులు తల్లికి వందనం అమలు చేయలేదని ట్రోల్ చేశారు. ఇప్పుడు తల్లికి వందనం అమలు చేస్తే దానిపై దుష్ప్రచారం సరికాదని ఇలాంటి బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరంలోనే నాలుగు గ్యారెంటీలను అమలు చేశామని త్వరలోనే సూపర్ సెక్స్ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతి మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు స్వామిదాస్, నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ రాజేంద్రన్, జిల్లా నాయకులు కృష్ణమ నాయుడు, దేవ సుందరం, కార్వేటినగరం మండల అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్, కుప్పయ్య టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *