Mana News :- తిరుపతి నవంబర్ 24,(మన న్యూస్ ) :-సనాతన ధర్మ వ్యాప్తికి, ఆధ్యాత్మిక పెంపుదలకు కార్తీక వనభోజన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని క్షత్రియ సోదరులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వడమాలపేట మండలము ఓబుల రాజు కండ్రిగ లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయములో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ సంఘము నాయకులు పి రుక్మాంగధ రాజు, రుద్రరాజు గురుప్రసాద రాజు, ప్రభుత్వ క్షత్రియ ఉద్యోగుల బృందాలు కలసి కార్తీకమాసము వనభోజన కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిధులు రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘము అధ్యక్షుడు బలరామరాజు , జనరల్ సెక్రటరీ శివరాజు, కె ఎల్ వర్మ, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి, మానవత కార్యదర్శి సుకుమార్ రాజు, నిరంజన్ బాబు, ఏ పరమేశ్వరరాజు, వి సుబ్రహ్మణ్యం రాజు, మనోహర్ మాట్లాడుతూ ఐకమత్యం కు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఓబిఆర్ కండ్రిగ గ్రామ క్షత్రియ సోదరులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *