మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను మద్నూర్ మండల కేంద్రంలోని మైధిలి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ముందుగానిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.అనంతరం నిజాంసాగర్ మండలం లోని నర్సింగ్ రావు చౌరస్తా వద్ద ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు డిసిసి ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు.అక్కడి నుంచి ఎమ్మెల్యేతో కలిసి భారీ బైక్ ర్యాలీగా మద్నూర్ వరకు చేరుకున్నారు.అనంతరం మైధిలి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ..తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎనిమిది మండలాల నుంచి తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు, కార్యకర్తల అండదండలతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు. అనంతరం నిజాంసాగర్ మండలంలోని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదిన సందర్భంగా మంగళూరు ఫారెస్ట్ లో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ శెట్టేకర్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, జరా నాగిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజా పండరి, రవీందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు ముజాహిద్, షేక్ సంధాని, గంగాధర్, ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్ నాయకుడు భుజంగారి భాస్కర్ రెడ్డి, గుర్రపు శ్రీనివాస్, బుజ్జ అంజయ్య తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *