• అమ్మ వాసవి సేవా ట్రస్ట్ చైర్మన్ వరద కృష్ణ….

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం గాజువాక జూలై 1 : శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అమ్మ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా 27వ వివాహదినోత్సవ సన్నిధి శ్రీనివాసరావు,కళ్యాణి దంపుతుల పెళ్లిరోజు సందర్భంలో ఒక నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరికి పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కారుమూరి మహేష్ శాలువాతో ఘనంగా సత్కరించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.ఈ సందర్భంగా కారు మూరి మహేష్ మాట్లాడుతూ అమ్మ వాసవి సేవా ట్రస్ట్ 132 మంది సభ్యులతో నిత్యం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ప్రతి సేవా కార్యక్రమంలో నా వంతు సహాయకారాలతో పాటు నిరుపేద ఆర్యవైశ్య అండగా నిలవడం చాలా సంతోషమని తెలిపారు.పుట్టినరోజు,వివాహ సందర్భాలు ఆనందకర సందర్భాలెన్నో ఉన్నప్పటికీ వేడుకలకు వేలకోట్ల ఖర్చుపెట్టి వేడుకలను జరిపిన ఆ మధుర క్షణం కొన్ని రోజులు మాత్రమే.ఒక నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపి చేసి ఆ కుటుంబానికి ఆసరాగా ఉండటం చాలా గొప్పవారు.ఆ యొక్క నిరుపేద కుటుంబ దీవెనలు,అమ్మ వాసవి మాత దీవెనలు ఈ పుణ్య దంపతులకు ఉండే విధంగా మనసారా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలిపారు.ఈ సందర్భంగా అమ్మ వాసవి సేవా ట్రస్ట్ చైర్మన్ వరదా కృష్ణ మాట్లాడుతూ శ్రీనివాసరావు కళ్యాణి దంపతులకు ముందుగా అమ్మ వాసవి సేవా ట్రస్ట్ తరపున వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.శ్రీశ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణాకటాక్షాలు ఈ పుణ్య దంపతులకు ఉండాలని ఈ యొక్క కార్యక్రమం ఒక నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం చాలా ఆనందకరం మా సేవా ట్రస్ట్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనలను పొందుతున్నారు. కష్టము అంటే గుర్తు వచ్చే ఒక మాట, ప్రతి నోటా వినే మాట ఒకే ఒక మాట అదే అమ్మ సేవా ట్రస్ట్. సేవా ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో నిత్యం విరాజిల్లుతుందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో కేసారపు సుబ్బారావు వరదా,కాశీ విశ్వనాథం కూర్మందాస్ సన్యాసి శెట్టి,చెరుకూరి కృష్ణ చేబోల్ శ్రీను,గుర్రాల శ్రీను,ఒక్కలగడ్డ రామకృష్ణచేగు రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *