మన న్యూస్ ,నెల్లూరు రూరల్:అంజన గోల్డెన్ గెలాక్సీ వారి మొదటి వెంచర్ను సింహపురి పరిసర ప్రాంత ప్రజలు సమర్శించి ఆదరించాలని ప్రముఖ సినీ హాస్యనటుడు, సినీ హీరో ఆలీ పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని స్థానిక మటెంపాడు మరియు పాలిచర్లపాడు గ్రామాలకు సమీపంలో నిర్వాహకులు గండవరపు వెంకురెడ్డి ఏర్పాటు చేసిన అంజన గోల్డెన్ గెలాక్సీ వెంచర్ ను ఆదివారం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. భూమిని నమ్ముకొని పెట్టుబడి పెట్టిన వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఫలాలు అనుభవించారని, భూమిని అమ్ముకున్న వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రకృతి పర్యావరణం కాలుష్య నివారణలలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేయబడిన అంజనా గోల్డెన్ గెలాక్సీహ్ పామ్ ల్యాండ్ నందు అతి తక్కువ ధరకే ప్లాట్లు కొనుగోలు చేసి తమ భవిష్యత్తు తరాలకు అధిక రావడులు ఇవ్వాలని సూచించారు. వాస్తు పరిజ్ఞానం లోనూ, టైటిల్ క్లియర్ విషయంలోనూ కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంజనా గోల్డెన్ గెలాక్సీ తగిన ఏర్పాటు చేయబడిందని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీ తో పాటు ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడిన కాంపౌండ్ వాల్, సీసీటీవీ ఫుటేజీలు, నిరంతరం త్రాగునీరు, అంతరాయం లేని విద్యుత్ లతోపాటు పొల్యూషన్ పరిరక్షణకై పచ్చని చెట్లు అంజనా గోల్డెన్ గెలాక్సీ నందు ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకుల సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవంలో పాల్గొన్న వ్యాపార ప్రతినిధులు మరియు వినియోగదారులకు ఉల్లాసపరితమైన వాతావరణాన్ని కలిగిస్తూ జబర్దస్త్ టీంచే వినోద భరితమైన కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *