వెన్నుపోటు పరిపాలనకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ మారారని .. కూటమి ప్రభుత్వం ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో .. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ మేరీగ మురళితో కలిసి, వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ చేశారు.ఈ సందర్బంగా చంద్రబాబు చేసిన అబద్ధపు హామీల అమలు కోరుతూ. ప్రజలకు అండగా నిలిచి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే..వైఎస్ఆర్సిపి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు.జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం.. అనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్న ప్రతిపక్ష నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ మేరీగ మురళి మాట్లాడుతూ……….. జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలిచి చేస్తున్న పోరాటాలకు.. భయపడి చంద్రబాబు నాయుడు.. తల్లికి వందనం పథకాన్ని ఎలాంటి ఆర్భాటం లేకుండా అమలు చేశారని తెలిపారు.తల్లికి వందనం పథకాన్ని..కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించిందన్నారు.పూర్తిస్థాయిలో లబ్ధిదారులందరికీ తల్లికి వందనం పథకం.. అందలేదన్నారు.ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రతిపక్ష పార్టీ నేతలపై ఇష్టా రీతిలో కేసులు పెడుతుండడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…..సూపర్ సిక్స్ పథకం పేరుతో.. ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్రులను చంద్రబాబు మోసం చేశారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారు. మొదట వెన్నుపోటు తోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని.. ఈరోజు అదే విధంగా ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచారు.2014 లో ఎన్నికల్లో బాబు వస్తేనే జాబ్ వస్తుందని ఇంటికో ఉద్యోగమని ప్రచారం చేసుకొని.. కేవలం ఐదేళ్ల పాలనలో చంద్రబాబు 34 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 3 లక్షల 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి.. ప్రజలకు సుపరిపాలన అందించారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు 143 హామీలను గుప్పించి.. వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునాదగా చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాల ఫలితంగా.. చంద్రబాబు నాయుడు ఒకటి, రెండు పథకాలను తూతూ మంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం పథకాలు అమలు చేసినప్పటికీ..అందులో పారదర్శకత లోపించిందన్నారు. సూపర్ సిక్స్ అంతా ఇచ్చేసామని.. ఇంకెవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే.. వారి నాలుక కోస్తామని చెప్పబోయి..మళ్ళి సవరించుకొని.. అలాంటి వారందరికీ నాలుక మందం అని చంద్రబాబు చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనం అన్నారు. ఓటు వేసిన ప్రజలను కించపరిచేలా.. వారి నాలుక కోస్తామన్న చంద్రబాబు మాటలను.. ప్రజలు అసహ్యించుకుంటున్నారు.గతంలో జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఎన్నో పథకాలు అమలుచేసి వారు.. ఆర్థికంగా.. అభివృద్ధి చెందేందుకు.. దోహదపడ్డారని అన్నారు.ఈరోజు అవన్నీ లేకుండా ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండి.. 59 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామన్న హామీని చంద్రబాబు పూర్తిగా విస్మరించారని అన్నారు.ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయమని కోరుతుంటే.. పి4తో అనుసంధానం చేశామని.. కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి గురించి కూడా అడిగిన వారికి.. కూడా ఇదేవిధంగా ఇండస్ట్రీ స్ తో పి4 అనుసంధానించామని.. చెబుతూ..యువతను మభ్యపెడుతున్నారని అన్నారు.అలాగే 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి.. ఈరోజు దాని ఊసే లేదన్నారు.రైతులకు రైతు భరోసా కింద 20 వేల రూపాయలను.. అందిస్తామని చెప్పి.. కేంద్రం ఇచ్చిన దాని గురించి చెబుతూ.. సమాధానం దాటవేస్తున్నారని అన్నారు. ఇలా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ మరచి ప్రజలను దగా చేస్తున్నారని అన్నారు. ఈరోజు చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలకు వెన్నుపోటుకు నిదర్శనంగా వైఎస్ఆర్సిపి..జగన్ అంటే నమ్మకం-చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరణ జరిపి..ప్రజలకు వారిచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరిపే వరకు ప్రజలకు అండగా నిలిచి వైసీపీ.. పోరాడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వై సీపీ మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిల్ల గౌరి, మాజీ ఏ యం సి చైర్మన్ కోటేశ్వర రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్ది విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రీత్ రెడ్డి, వై సి పి సీనియర్ నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, సాయి మోహన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//