వలస ఆదివాసి ప్రజల సంక్షేమమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం

ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ఉ చిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, అశ్వాపురం మండలంలోని వేములూరు,మనుబోతులగూడెం, మల్లయ్య గుంపు,అయితయ్య గుంపు,సంతోష్ గుంపు, నాగేశ్వరరావు గుంపు,గుండ్ల మడుగు వలస గొత్తికొయ గ్రామాలలో నివసించే ఆదివాసి ప్రజలకు వేములూరు గ్రామంలో అశ్వాపురం పోలీసుల ఆధ్వర్యంలో రోటరీ క్లబ్,భద్రాచలం వారి సహకారంతో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రారంభించారు.మొత్తం 07 గుత్తికోయ గ్రామాల నుంచి సుమారు 400 కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.నిపుణులైన వైద్యులచే వైద్య చికిత్సలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.అనంతరం అక్కడ ఉన్న యువతకు వాలీబాల్ కిట్లను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ తరపున ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని తెలిపారు.ఇందులో భాగంగానే తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలోని ఆదివాసి ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.వాతావరణంలో మార్పుల కారణంగా దోమలు అధికమై మలేరియా,డెంగ్యూ లాంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.నిషేధిత సిపిఐ మావోయిస్టులు తమ మనుగడ కోసం ఆదివాసి ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు సహకరించవద్దని,మావోయిస్టుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువతీ,యువకులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకొని తమ తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటుకు సహకరించిన రోటరీ క్లబ్ వారికి,వైద్య బృందానికి, అశ్వాపురం పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించిన వైద్యులను సన్మానించారు.అనంతరం వైద్య శిబిరంలో పాల్గొన్న వారితో ఎస్పీ సహపంక్తి భోజనం చేశారు.అనంతరం మారుమూల గ్రామాలైన మనుబోతులగూడెం మల్లయ్య గుంపు గుత్తి కోయ గ్రామాలను ఎస్పీ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి,ఎస్సైలు తిరుపతి రావు,రవుఫ్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్,భద్రాచలం బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ