మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు… మానవ సంబంధాలు మెరుగుపడడానికి,మనుష్యుల మధ్య అంతరాలను తగ్గించేందుకు కార్తీక మాసంలో వనభోజనాలు దోహదపడతాయని తూర్పు కాపుల సంఘ నాయకులు పత్రి రమణ,గోపిశెట్టి శ్రీను,అప్పికొండ అయ్యప్ప అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కొమ్ముల నల్ల కన్నబాబుకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో తూర్పు కాపు వన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఉదయం నుండి తూర్పు కాపు కుటుంబాలు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆర్కెస్ట్రా,డాన్స్ బేబీ డాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఆటపాటలతో, ఉల్లాసంగా,ఉత్సాహంగా గడుపారు.సుమారు 4000 మందికి పైగా హాజరు కావడంతో భోజనాలు చేయడానికి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఎక్కువ స్టాల్స్ ఏర్పాటు చేశారు. తూర్పు కాపు కుటుంబాలను ఏకం చేయడానికి కృషి చేసిన గోపిశెట్టి శీను,అప్పికొండ అయ్యప్పలను పత్రి రమణ, కట్టమూరి కొండబాబు మరియు కుల పెద్దలు చేతుల మీదుగా పూలమాలలతో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ గోపిశెట్టి శ్రీను, అప్పికొండ అయ్యప్పలు వయసులో చిన్నవారైనా చక్కటి ఆలోచనతో అందరినీ ఏకం చేసారని కొనియాడారు.ఇకపై మనమందరం ఐకమత్యంగా ఉండి సంఘంగా ఏర్పడి మన పిల్లల భవిష్యత్తుకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు.గోపిశెట్టి శ్రీను మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి గుర్తించి వారికి చేయూతనివ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని, అందరూ కలిసికట్టుగా ఉంటూ రిజర్వేషన్లతో పాటు అన్ని హక్కులు సాధించుకోవాలన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *