ఐరాల, నవంబర్ 24 మన న్యూస్ :- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లి చెరువు ఆక్రమణలు తొలగించాలని కోరుతూ కాణిపాకం చెరువు సాగునీటి సహకార సంఘం చైర్మన్ చరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాణిపాకం గ్రామపంచాయతీ పరిధిలో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించగా ఐరాల మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి పంచాయతీకి అప్పజెప్పడం జరిగింది. అయితే కొంతమంది కబ్జాదారులు తమ భూమి ఆనుకుని ఉన్న భూమిని యదేచ్చగా కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కలెక్టర కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ కు అలాగే జిల్లా పంచాయతీ అధికారి కి కూడా వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు జిల్లా రెవిన్యూ అధికారి మోహన్ కుమార్ ఐరాల మండల తాసిల్దార్ మహేష్ కు వెంటనే ఆక్రమణల తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు .ఈ మేరకు ఐరాల మండల తాసిల్దార్ మహేష్ కుమార్ తన సిబ్బందితో కాణిపాకం పంచాయితీ స్థలానికి వెళ్లి సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించాలని సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో కాణిపాకం గ్రామస్తులు ప్రసాద్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పట్టాభి రెడ్డి, జయచంద్రారెడ్డి ఎల్. గోపీనాథ్, సురేష్ రెడ్డి పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *