శంఖవరం / అన్నవరం మన న్యూస్ (అపురూప్): అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతులకు ఘననివాళులు అర్పిస్తూ వైస్సార్సీపీ ఇంచార్జి “ముద్రగడ గిరిబాబు” ఆదేశాల మేరకు అన్నవరం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక పెద్ద రావి చెట్టు సెంటర్ వద్ద గల అంబేద్కర్ కూడలి నుండి మార్కెట్ లో గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ ని నిర్వహించారు. ఈ సందర్బంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం, స్థానిక సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా మాట్లాడుతూ, ఈ దుర్గటన చాలా విచారకరమైనదాని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిసిటీ వింగ్ నియోజకవర్గం అధ్యక్షులు సరమర్ల మధుబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక వైస్సార్సీపీ నేతలు వాణిజ్య విభాగం అధ్యక్షులు గణేసుల బాబ్జి, బలువు హరిబాబు, బత్తుల రవి కుమార్, బి ఎస్వి ప్రసాద్, రాయి శ్రీనివాస్, వార్డు సభ్యులు సింగంపల్లి రాము, కొండి సూరిబాబు, కాండ్రకోట రాజు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *