• న్యాయస్థానం లో న్యాయం గెలిచింది
  • వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి సుప్రీం కోర్టులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అక్రమ అరెస్టు కేసులో ఎదురుదెబ్బ తగిలిందిని, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ను తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం హర్షనీయమని నియోజకవర్గ వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. కిర్లంపూడి లో మాజీ మంత్రి పొలిటికల్ అఫైర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసం లో అన్నవరం, సిరిపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ముద్రగడ గిరిబాబు ను మర్యాద పూర్వకంగా కలిశారు. గిరిబాబు మాట్లాడుతూ, గ్రామాల్లో వైసీపీ పార్టీని బలోపేతం చేసే విదంగా పనిచేయాలన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం లో అరాచక పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సరమర్ల మధు బాబు, గణేశుల లక్ష్మణ స్వామి, గొల్లపల్లి కాశి, మాజీ సర్పంచ్ మజ్జూరి సూర్యనారాయణ, మజ్జూరి రామలింగేశ్వరరావు, సోము సూర్యుడు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *