శంఖవరం మన న్యూస్ (అపురూప్) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం ఏపీ మోడల్ స్కూల్ లో మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. కిరణ్ కోరారు. గురువారం పత్రిక ప్రకటన ద్వారా ఆయన మాట్లాడుతూ,7 వ తరగతి లో మూడు మిగులు సీట్లకు మరియు 8 వ తరగతి లో ఒక మిగులు సీటు కు భర్తీ కి గాను దరఖాస్తు చేసుకునేందుకు విద్యా శాఖ కమిషనర్ మరో అవకాశం కల్పించిందని అన్నారు. ఆసక్తి , అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 5 వ తేదీ నుండి 20 వ తేదీ లోగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *