

శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్ :- గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి రంగనాథ్ స్వామి దేవాలయం వద్ద ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ హాజరై అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.ఆధ్యాత్మికతతో నిండిన వేడుక దేవాలయం ప్రాంగణం. రంగురంగుల పూలతో అలంకరించబడింది. ప్రత్యేక మండపంలో శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ అయ్యప్ప స్వామి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అయ్యప్ప భజనలతో ప్రాంగణం స్వామి నామస్మరణతో మారుమోగింది. స్వామి వారికి విశిష్ట పూజా కార్యక్రమాలు :- పాలాభిషేకం, నెయ్యాభిషేకం, మరియు పదునెట్టంబడిపై దీపాలు వెలిగించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరాటంకంగా కొనసాగాయి.అనంతరం పదునెట్టంబడిపై దీపాలు వెలిగించారు. ఈ పూజ కార్యక్రమంలో సుమారు 1000 పైచిలకు మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.వీరితో పాటు సుమారు 2 వేల మంది సాధారణ భక్తులు అయ్యప్ప స్వామి పూజకు తరలివచ్చారు. ఈ సందర్భంగాకార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన తప్పక కలిగి ఉండాలని అన్నారు .అయ్యప్ప స్వామి ఆచరించే నియమాలు భక్తులను నీతినిష్టులకు ప్రేరేపిస్తాయి అన్ని అన్నారు.ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి అయ్యప్ప మాల ధరించి స్వామి సేవలో పాల్గొనాలి” అని పిలుపునిచ్చారు.స్వామి వారి పడిపూజా మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామి వారి కృప తప్పక ఉంటుందని పేర్కొన్నారు.పూజలో పాల్గొన్న అయ్యప్ప స్వాములతో పాటు పూజకు హాజరైన వేలాదిమంది భక్తులకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎత్తున అన్నదానం (బిక్ష) ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అయ్యప్ప స్వాములు, మహిళలు, పిల్లలు, గోపనపల్లి గ్రామస్థులు తదితరులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
