సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసిన టిడిపి నేత శ్రీధర్ యాదవ్

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంటుందని మాజీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ యాదవ్ అన్నారు.గంగాధర నెల్లూరు మండలం నేల్లేపల్లి పంచాయతీలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరికీ పారదర్శకంగా వేరుశనగ విత్తనాలను అందిస్తున్నామని అన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని రైతులే దేశానికి వెన్నెముక అనే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగయ్య ,మాజీ సర్పంచ్ పుష్పరాజ్ ,గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, నాయకులు జీకే దేవరాజు నాయుడు, హార్టికల్చర్ అసిస్టెంట్ కవిత, పంచాయతీ కార్యదర్శి మనజ్, తులసి ,పంచాయతీ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *