ప్రజా సమస్యలను పరిష్కరించండి అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో సమస్యలకు పరిష్కారం దొరుకునని ప్రభుత్వ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు శుక్రవారం వెదురుకుప్పం మండలం పాల ఆళ్లమడుగు సచివాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం తాసిల్దార్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ పాల్గొన్నారు ప్రజల నుండి అర్జీలను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రజా పరిష్కార కార్యక్రమం నిర్వహించిన అందులో రెవెన్యూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో పరిష్కరించకుండా దౌర్జన్యాలు అక్రమాలు చేయడంతో నేడు ఇన్ని అర్జీలు ప్రజలు ఇస్తున్నారని వెంటనే వీటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు తాను అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బాబు, ఎంపీడీవో పురుషోత్తం, మండల అధ్యక్షులు లోకనాథం రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు మోహన్ మురళి, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి అనిల్, నియోజకవర్గ యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్, దళిత నేత సుధాకర్, రాష్ట్ర సంస్కృతిక ప్రధాన కార్యదర్శి ముని చంద్రారెడ్డి, నియోజకవర్గ సుధాకర్ రెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్, రాజా, టిడిపి నాయకులు మండల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *