మన న్యూస్, గూడూరు:గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని బాలింతలకు బ్రేడ్ పండ్లు పంపిణీ చేశారు.ఈకార్యక్రమనికి ముఖ్య అతిధిగా పాల్గొన్న హాస్పిటల్ సుపెరిండెంట్ షేక్ షరీనా బేగం మాట్లాడుతూ ……ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పేద రోగులకు బ్రేడ్ పండ్లు పంపిణీ చేసిన బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఆమె అభినందనలు తెలియచేశారు.అసోసియేషన్ అధ్యక్షులు ఆత్మకూరు సురేష్ మాట్లాడుతూ….. 30సంవత్సరాల తన పొలిటికల్ కేరీర్ లో నిరంతరం పేదల పక్షాన నిలబడి ప్రజానాయకుడు పాశిం సునీల్ కుమార్ కి మా అసోసియేషన్ తరుపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నన్నారు. ఈకార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గోపి,నిరంజన్, మల్లి, వినోద్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *