మన న్యూస్ ,గూడూరు :గూడూరు లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు సోమవారం రాత్రి తూపిలి కళ్యాణ్ చక్రవర్తి దివ్య పాప సోనిక జన్మదిన సందర్భంగా తాతయ్య నానమ్మ తూపిలి సురేంద్ర పద్మజ సంపూర్ణ సహకారంతో వృద్దులకు మంచి రుచకరమైన భోజనం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ…. కరణాల వీధి ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ సురేంద్ర పద్మజా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని అందులో భాగంగా వారి మనవరాలు సోనిక జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం లో భోజన వసతిని ఏర్పాటు చేశారని. పిల్లలు అమెరికాలో ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారు అందరికీ ఆదర్శమని ఆ కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు తూపిలి యశ్వంత్, కె ఆర్ ఎం, పీడీ కరిముల్లా, పోతిరెడ్డి పెంచలయ్య, డిష్ నాగరాజు, కోట వెంకటేశ్వర్లు, కుమార్ నాయుడు, కృష్ణారెడ్డి, విజయ్, నాగేంద్ర ,నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *