{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

బద్వేల్: మన న్యూస్: జూన్ 02
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం కు గోపవరం మండలం మడకలవారిపల్లె రెవెన్యూ విలేజ్ లో సర్వే నెంబర్లు 982/1. 982/2 లలో 9ఎకరాల 72 సెంట్లు భూమి కలదు ఆ భూమి కి శివాలయం చైర్మన్ పాటూరు శివ శంకర్ రెడ్డి ఆలయ ఈవో రామలింగారెడ్డి, కొండ్రెడ్డి గంగిరెడ్డిలు సర్వే చేయించి శివాలయం భూమికి సంబంధించిన హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ భూమి మున్సిపాలిటీ పరిధిలో ఉండడం ఆ భూమి విలువ కోట్లల్లో ఉండటంతో, కబ్జాదారుల కన్ను పడింది. సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు శివాలయం సంబంధించిన భూమి సుమారు 15 సెంట్లు ఆక్రమించేందుకు పునాదులు తీసి ఉంచారు. విషయం తెలుసుకున్న శివాలయం చైర్మన్ శివ శంకర్ రెడ్డి ఆలయ ఈఓ కలిసి సదరు స్థలాన్ని పరిశీలించి అది శివాలయం చెందిన భూమిగా నిర్ధారించి పునాదులు పై మట్టి వేయించి యధా ప్రకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామలింగారెడ్డి, చైర్మన్ శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ శివాలయం సంబంధించిన భూమిలో ఎటువంటి ఆక్రమణలు చేయాలని చూసినా కట్టడాలు నిర్మించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *