మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిలు భార్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. అదే గ్రామానికి చెందిన విఠల్ అనే యువకుడు ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు విషయం తెలుసుకొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కార్యకర్తలు సాయిలు,విఠల్ ల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *