రేషన్ దుకాణాల వద్ద రేషన్ పంపిణీ తో ప్రజలకు మేలు……. రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు, జూన్ 1:- ఇక రేషన్‌ ఎప్పుడైనా తీసుకోవచ్చు.- త్వరలోనే మరిన్ని సరకులు అందించేందుకు ప్రభుత్వం కృషి.- రేషన్‌ దుకాణంలో సరకుల పంపిణీని ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ.కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన రేషన్ దుకాణాల వద్ద నిత్యావసరాల పంపిణీ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ తో కలిసి ఆయన ఆదివారం జనార్ధన రెడ్డి కాలనీలో 102 నెంబర్ రేషన్ డిపో వద్ద పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మంత్రి మాట్లాడుతూ …..ఎండియు వాహనాల ద్వారా రేషన్ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని, రేషన్ షాపుల ద్వారా అందించాలని ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు. దీని ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఎవరూ తమ పనులు మానుకొని రేషన్‌ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఎప్పుడైనా రేషన్‌ తీసుకోవచ్చని తెలిపారు. ఈ పాత విధానం ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. రేషన్‌ దుకాణాల్లో తక్కువ ధరకే మరిన్ని సరకులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ….. ఎండియూ వాహనాల ద్వారా రేషన్ ఇచ్చే విధాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని, రేషన్ షాప్ ల ద్వారా అందించాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 1 కోటి 46 లక్షల కార్డ్స్ ఉన్నాయని, ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందని, 65 సంవత్సరాలుపై బడిన వారికి దివ్యాంగులకు 1 వ తేదీ నుండి 5 వ తేదీలోగా ఇళ్ల వద్దే అందించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 42 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం పథకం ప్రారంభమైనప్పటి నుంచి రేషన్ షాపులు అలాగే పనిచేసేవి.. ఈ ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం మార్చి గందరగోళానికి తెరలేపిందన్నారు. MDU వాహనాలకోసం 1800 కోట్లు ఖర్చు చేసి , సక్రమంగా అందించక ప్రజలను ఇబ్బందులు పెట్టిందన్నారు.ఇంచార్జి కలెక్టర్ కార్తిక్, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహసీన్ తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…