దేశంలోనే ది బెస్ట్ స్కూల్ గా వి ఆర్ పాఠశాలను మారుస్తున్నాం…. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి

మన న్యూస్ నెల్లూరు మే 25:దేశంలోనే ది బెస్ట్ మోడల్ స్కూల్ గా వి.ఆర్.సి పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి తెలిపారు. నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానంలో చేపడుతున్న స్కూల్ ఆధునీకరణ పనులను పొంగూరు షరణి పరిశీలించారు. పనుల్లో మరింత వేగం పెంచాలని ఎన్సీసీ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా షరణి మీడియాతో మాట్లాడుతూ…… మా నాన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చారని.., ఆపేదల కష్టాలు ఆయనకు బాగా తెలుసన్నారు. ఎన్నికల సమయంలో పేద పిల్లల పరిస్థితి చూసి మాట ఇచ్చారని.. ఆ మాట ప్రకారమే పనులు శరవేగంగా చేస్తున్నారన్నారు. 1975 లో పురుడుపోసుకున్న వీఆర్ హైస్కూల్ ని వైఎస్సార్సీపీ మూసేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మూతపడ్డ వీఆర్ హై స్కూల్ ని ఓపెన్ చేసేందుకు ఎంచుకొన్నారని.. ప్రతీ పేద విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో మంత్రి నారాయణ ముందుకు వెళ్తున్నారన్నారు. స్కూల్ ఆధునీకరణ పర్యవేక్షణ బాధ్యతలు తనకు అప్పగించారన్నారు. జూన్ 12 న స్కూల్ ప్రారంభమౌతుందని. ప్రపంచస్థాయి మౌలికసదుపాయాలు కల్పించబోతున్నామన్నారు. దేశంలోనే బెస్ట్ స్కూల్ గా తీర్చిదిద్దాలన్నదే మా నాన్న సంకల్పం అని ఆమె వెల్లడించారు. ఎన్సీసీ సిబ్బంది పనులను వేగంగా చేస్తున్నారని, సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 కింద కొంత మంది విద్యార్థులను దత్తత తీసుకుంటున్నానని ఆమె తెలిపారు. రోబోటిక్ లాబ్ , కంప్యూటర్ ల్యాబ్ , సైన్స్ ల్యాబ్ , నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారని.. వీఆర్సి హై స్కూల్ ను రోల్ మోడల్ గా నిలబెట్టి మాట నిలబెట్టుకొంటామన్నారు..

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి