
మన న్యూస్, నెల్లూరు/ ఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ సెక్రటరీ కాంతారావుని తిరుపతి ఎంపీ గురుమూర్తి తో కలిసి వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన మైనింగ్ సెక్రటరీ కాంతారావు గతక్షణమే వివరాలు తెప్పించుకొని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఫిర్యాదును మైనింగ్ మంత్రి కిషన్ రెడ్డి కి, సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే కి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని, అక్రమ మైనింగ్ పై తుది వరకు అంచలవారీగా పోరాటం చేస్తామని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పత్రిక ప్రకటనలో తెలియజేశారు.
