గంజాయి,మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు బట్టుపల్లి, కరకగూడెం పాఠశాలలో, మత్తు పదార్థాల నివారణపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం

మన న్యూస్: కరకగూడెం, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కరకగూడెం ఎస్సై రాజేందర్ మండల వ్యాప్తంగా పరిధిలోని పాఠశాలల విద్యార్థిని,విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వలన వాటిల్లే నష్టాల గురించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.చాలామంది యువత మత్తుకు బానిసలై తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని,మత్తు వలన విచక్షణ కోల్పోయి ప్రమాధాలకు గురవ్వడం,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం చేస్తున్నారని, అలాంటివారిలో మార్పు తీసుకురావడానికి పోలీస్ శాఖ తరపున అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగించడం ద్వారా యువత భవిష్యత్తు నాశనం కాకూడదనే సదుద్దేశం తో పోలీస్ శాఖ తరపున ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.అదే విధంగా పాఠశాలలలో ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,మండలంలోని అన్ని స్కూళ్లు, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేసినా,విక్రయించినా,వినియోగించడం లాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.మత్తు పదార్థాల అక్రమ రవాణా గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని మండల ప్రజలను కోరారు. ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై రాజేందర్, రైటర్ దుర్గారావు, శివ, పోలీస్ సిబ్బంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    మన ధ్యాస నారాయణ పేట జిల్లా: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి గురువారం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన…

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.మొదటి దశలో నారాయణపేట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.