

మన న్యూస్ ,విడవలూరు ,మే 11:విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో వెలసి వున్న అలగనాధ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి ఆశీర్వచనాలు అందచేశారు. అలగనాధ స్వామి అనుగ్రహంతో పార్లపల్లి గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా వుండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. అలగనాధ స్వామి ఆశీస్సులతో పార్లపల్లి వాసులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లపల్లి సర్పంచ్ రామిశెట్టి స్వాతి, టిడిపి నాయకులు ఆడపాల శ్రీధర్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, రామిశెట్టి వెంకటేశ్వర్లు, వేగూరు చంద్ర తదితరులు పాల్గొన్నారు.
