

మనన్యూస్,తిరుపతి:సిమ్స్ ఉద్యోగుల సంఘం, సిమ్స్ అలీడ్ హెల్త్ పూర్వపు విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో తుమ్మలగుంట న్యూ స్లిమ్ బ్యాట్మెంటన్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో విన్నర్స్ గా ఎన్ఎస్ఆర్ మురళీకృష్ణ, ప్రకాష్ నిలిచారు. హోరాహోరీగా జరిగిన బ్యాట్మెంటన్ పోటీలలో రన్నర్స్ గా శ్రీ మురళీ, సురేష్ లు
నిలచారు. ఈ పోటీలలో రమేష్, శ్రీకాంత్ లు మూడవ స్థానంలో గెలుపొందారు. మొట్టమొదటిసారిగా స్విమ్స్ ఉద్యోగుల సంఘం, స్విమ్స్ అల్లైడ్ హెల్త్ పూర్వపు విద్యార్థుల సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నమెంటు జరిగింది. క్రీడలను అలవర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని డిప్యూటీ డైరెక్టర్ సతీష్, సీఎంఆర్ఓ కే.వివేకానంద్ లు తెలిపారు. ఉద్యోగులలో స్నేహ పూర్వక వాతావరణం నెలకొల్పడానికి ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయని వారు చెప్పారు. ఈ టోర్నమెంట్ నిర్వహణలో సిమ్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు సురేష్, రామమూర్తి, ఉపాధ్యక్షులు శివ,కోశాధికారి గోవర్ధన్
పాల్గొన్నారు. సిమ్స్ ఉద్యోగుల క్రీడలను ఫిజికల్ డైరెక్టర్ మధుబాబు పర్యవేక్షించారు.