

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 27: బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్ మరియు సిబ్బంది తోటి నెల్లూరు జిల్లా బోర్డర్ పి పి కుంటలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానాస్పద వాహనాలను మరియు వ్యక్తుల గురించి విచారించడమైనది. వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన మరియు ట్రాఫిక్ రూల్స్ తెలపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని ప్రతి ఒక్కరూ పోలీసు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.