- అన్నవరం లో ముద్రగడ గిరిబాబు పర్యటన..
శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించి వైసిపి కార్యకర్తలు నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితులు పెండ్యాల రాము, సుబ్రహ్మణ్యం (తండ్రి) సత్యనారాయణమూర్తి ఇటీవల కాలంలో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఏ కష్టం వచ్చినా రాము, సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.