శంకవరం, మన న్యూస్ (అపురూప్)
కొంతంగి కొత్తూరు గ్రామానికి చెందిన కర్రీ అగ్గిబాబు అనే రైతు తన భూమికి సంబంధించిన సర్వేలో పలు పొరపాట్లు చోటుచేసుకున్నాయని, వాటిని సరిచేయాలని గత ఎనిమిది నెలలుగా రీ-సర్వే కోసం అధికారులను ఆశ్రయిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ రీ-సర్వే ప్రక్రియలో సంబంధించిన సర్వేయర్ స్పందించకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు తెలిపిన వివరాల ప్రకారం, కొంతంగి కొత్తూరు గ్రామంలో 88/2 సర్వే నెంబరు గల భూమిలో 72 సెంట్లు భూమి ఉండగా తమ కుటుంబ అవసరల కోసం 50 సెంట్లు అమ్మకం జరిగిందని దీనిపై సబ్ రిజిస్టర్ కార్యాలయం వారిని సంప్రదించగా వీటిని రెండు భాగాలుగా విభజించుకుని రమ్మని చెప్పడంతో అనేక మార్లు తిరిగినా సరే స్పందించకపోవడంతో ప్రైవేట్ సర్వేర్ ని ఆశ్రయించి తను ఇచ్చిన రిపోర్టు ప్రకారం సర్వే చేయమని కోరడమె కాకుండా తప్పుగా కొలవబడ్డ భూమికి సరిచూడాలని పలుమార్లు చలానాలు కట్టి, సంబంధిత సర్వేయర్ చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, రీ-సర్వే చేయాలంటే మొత్తం భూమికి చెల్లించాలంటూ అనుచితంగా డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో, శంకవరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించిన అగ్గిబాబు, తాసిల్దార్ తాతారావుని వివరణ కోరగా స్పందించిన తహసీల్దార్ మండల సర్వేయర్‌ను సంప్రదించిమని తెలపడంతో ఇది తప్పుగా చేయబడింది అని తెలిపారు. రైతు తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాడు.