రైతులకు స్కోప్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది—జిల్లా ఇన్స్పెక్టర్ ఆకుల వంశీ—ఏ డి ఏ నాగరాజు

కడప జిల్లా: సిద్ధవటం: మన న్యూస్: ఏప్రిల్ 20: సిద్ధవటం మండలంలోని నేకనాపురం గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ జిల్లా ఇన్స్పెక్టర్ ఆకుల వంశీ ఆధ్వర్యంలో ఏకశిలా ఎఫ్ పి ఓ ద్వారా రిజిస్టర్ అయిన నువ్వుల పంటకు సంబంధించి ఇండ్ గ్యాప్ పొలంబడి రైతులతో సమావేశం నిర్వహించి నువ్వుల విత్తనాలు నమూనాలను సేకరించడం జరిగినది. ఈ విధంగా సేకరించిన విత్తనాలను లాబ్ కు పంపి ఎటువంటి రసాయనాలు వాడలేదని ధ్రువీకరించిన తరువాత రైతులకు స్కోప్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. తద్వారా రైతులు పండించిన ఉత్పత్తులకు అధిక ధర లభించే మార్కెటింగ్ అవకాశం ఉంటుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బద్వేల్ డివిజన్ ఏడిఏ నాగరాజు హాజరయ్యి వ్యవసాయ అధికారులు అందించే సలహాలు సూచనలు రైతులు తప్పనిసరిగా పాటించి అధిక ఖర్చులు తగ్గించుకొని నాణ్యమైన దిగుబడులు పొందాలని రైతులకు సూచించారు .తదుపరి APSOPCA జిల్లా ఇన్స్పెక్టర్ ఆకుల వంశీ ఏకశిలా FPO ని సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం నందు ఏకశిలా ఎఫ్.పి.ఓ సీఈవో కె.మౌనిక, బొగ్గిడివారిపల్లె వి ఏ ఏ బి.సందీప్, సింహ యాదవ్, మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    కఠోరమైన దీక్ష, మహర్షి భగీరధుని త్యాగం మరువలేనిది.

    శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని జరుపుకోవడం సంతోష దాయకమని శంఖవరం మండల అధ్యక్షుడు పర్వత రాజబాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన…

    మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన సంప్రదాయానికి గొప్ప ముద్ర…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్) : భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ శుభాకాంక్షలు తెలిపారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక సగర కాలనీ సమీపంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కఠోరమైన దీక్ష, మహర్షి భగీరధుని త్యాగం మరువలేనిది.

    కఠోరమైన దీక్ష, మహర్షి భగీరధుని త్యాగం మరువలేనిది.

    మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన సంప్రదాయానికి గొప్ప ముద్ర…

    మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన సంప్రదాయానికి గొప్ప ముద్ర…

    స్టార్ బేకరీ అండ్ కేఫ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..;!

    స్టార్ బేకరీ అండ్ కేఫ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..;!

    ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి: మహిళా పోలీస్ కీర్తి

    ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి: మహిళా పోలీస్ కీర్తి