కడప జిల్లా: సిద్ధవటం: మన న్యూస్: ఏప్రిల్ 20: సిద్ధవటం మండలంలోని నేకనాపురం గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ జిల్లా ఇన్స్పెక్టర్ ఆకుల వంశీ ఆధ్వర్యంలో ఏకశిలా ఎఫ్ పి ఓ ద్వారా రిజిస్టర్ అయిన నువ్వుల పంటకు సంబంధించి ఇండ్ గ్యాప్ పొలంబడి రైతులతో సమావేశం నిర్వహించి నువ్వుల విత్తనాలు నమూనాలను సేకరించడం జరిగినది. ఈ విధంగా సేకరించిన విత్తనాలను లాబ్ కు పంపి ఎటువంటి రసాయనాలు వాడలేదని ధ్రువీకరించిన తరువాత రైతులకు స్కోప్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. తద్వారా రైతులు పండించిన ఉత్పత్తులకు అధిక ధర లభించే మార్కెటింగ్ అవకాశం ఉంటుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బద్వేల్ డివిజన్ ఏడిఏ నాగరాజు హాజరయ్యి వ్యవసాయ అధికారులు అందించే సలహాలు సూచనలు రైతులు తప్పనిసరిగా పాటించి అధిక ఖర్చులు తగ్గించుకొని నాణ్యమైన దిగుబడులు పొందాలని రైతులకు సూచించారు .తదుపరి APSOPCA జిల్లా ఇన్స్పెక్టర్ ఆకుల వంశీ ఏకశిలా FPO ని సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం నందు ఏకశిలా ఎఫ్.పి.ఓ సీఈవో కె.మౌనిక, బొగ్గిడివారిపల్లె వి ఏ ఏ బి.సందీప్, సింహ యాదవ్, మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.