

కడప జిల్లా: పోరుమామిళ్ల: మన న్యూస్: ఏప్రిల్ 20: పోరుమామిళ్ల మండలం పులివీడు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొంది తన కుడికాలు కోల్పోయిన గొడుగు బాదుల్లా తన ఇంటికి వచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంచి వాలంటరీగా పనిచేస్తూ అందరితో మంచి పేరు సంపాదించుకున్న గొడుగు బాదుల్లా (30) చిన్న వయసులోనే ఒక కాలు కోల్పోవడం జరిగింది. ఇతనికి భార్య దస్తగిరి అమ్మ (22) ఇద్దరు ఆడపిల్లలు ఒక పాపకు (2) సంవత్సరాలు మరో పాపకు 4 నెలలు గల పిల్లలు ఉన్నారు. గుంటూరు హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే విషయం తెలుసుకొని వారి స్వగృహం కు వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి , మాజీ పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త రమణారెడ్డి , జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రెటరీ రాళ్లపల్లి నర్సింహులు, వెంకటరెడ్డి ,మస్తాన్. బాబు , బాదుల్లాగారు,. గురువిరెడ్డి . హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అయినదని బాదుల్లా అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు మాట్లాడుతూ చిన్న వయసులోనే కాలు కోల్పోవడం చాలా బాధాకరమని . భార్య చిన్న పిల్లలను చూసి ఆయన బాధపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసే దానికి తప్పకుండా కృషి చేస్తామని వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింద.