

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం, పాకల పంచాయతీ పరిధిలో పోతయ్య గారి పాలెం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఆడుతున్న ఆటగాళ్లకు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మరియు గ్రామ కాపులు సిహెచ్ బ్రహ్మయ్య, కే నరసింహ ఆధ్వర్యంలో టీషర్ట్ లు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా రాజేష్ గారు క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని వీక్షించడం జరిగినది. రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ వ్యాయామం అనేది చాలా ముఖ్యం అని, ఆ క్రమంలో క్రికెట్ టోర్నమెంట్ ఆడుతున్న ఆటగాళ్లకు మా వంతు సహాయం చేసి క్రీడాకారులను మరింత ఉత్తేజింప చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, కార్యదర్శి అనుముల శెట్టి కిరణ్ బాబు, కిచ్చెం శెట్టి ప్రవీణ్ కుమార్, ప్రచార కార్యదర్శి తగరం రాజు, మమిళ్ల మణికంఠ,పూసల కిరణ్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.