
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం జడ్డింగ్ అన్నవరం, తూర్పు లక్ష్మీపురం, మర్రివీడు గ్రామాల్లో సచివాలయం పరిధిలో గల ఐసీడీఎస్ అధికారులు సూచనలతో బాల వివాహాలు నిర్మూలన దిశగా చేపట్టిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్డింగ్ అన్నవరం సర్పంచ్ బి కళ్యాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ సూరి కుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.బాల్య వివాహరహిత ముక్త భారత్ 100 రోజులు భాగంగా ఈరోజు జె. అన్నవరం, మర్రివీడు, తూర్పు లక్ష్మీపురం సచివాలయం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో బాలల వివాహం నిర్మూలన ప్రతిజ్ఞ చేపట్టారు. బాల్య వివాహాలు నిర్మూలించే దిశగా కమిటీ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బి కళ్యాణి,సూపర్వైజర్ సూర్యకుమారి మాట్లాడుతూ మండలంలో ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు,రూ.లక్ష జరిమానా తప్పదని హెచ్చరించారు. బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ ప్రోగ్రాంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన కల్పించారు. ఆడపిల్లలకు 18ఏళ్ళు,అబ్బాయిలకు 21 ఏళ్లు పూర్తయిన తర్వాతనే వివాహం చేయాలన్నారు.నిర్దేశిత వయసులోపు వివాహా లు చేసినట్లయితే చట్టప్రకారం సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. అదేవిధంగా వివాహానికి హాజరైన వారికి కూడా శిక్ష పడుతుందన్నారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నదని తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీస్ హెల్ప్ లైన్ 100 కు ఫోన్ చేయాలన్నారు.కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు , పంచాయతీ సెక్రెటరీ,వీఆర్వో, ఏఎన్ఎమ్ లు,మహిళా వార్డ్ మెంబర్లు,అంగన్వాడి కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.