చైతన్యపురి లో రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్ ఘనంగా 5వ బ్రాంచ్ ప్రారంభం – ఆధునిక స్కిన్ & హెయిర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో చైతన్యపురి శివాజీ బొమ్మ సర్కిల్ సమీపంలో ప్రముఖ రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్ తమ 5వ బ్రాంచ్‌ను గురువారం ఘనంగా ప్రారంభించింది.గత 26 సంవత్సరాల కాలంగా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ అంచలంచలుగా ఎదుగుతూ
మంచి పేరు సంపాదించుకున్న ఈ క్లినిక్ విస్తరణలో మరో మైలురాయిని సాధించింది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బంధుమిత్రులు హాజరై రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. స్నేహశీలి వైద్య నిపుణులు విశిష్ట అతిథులుగా పాల్గొని క్లినిక్‌లోని వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ క్రాంతి కుమార్ గుప్తా మాట్లాడుతూ,ఇది మా ఐదవ బ్రాంచ్. అన్ని బ్రాంచ్‌లలో ఆధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన డెర్మటాలజిస్టులు ట్రైన్డ్ మెడికల్ టీమ్‌తో సేవలు అందిస్తున్నాము. కేవలం వ్యాపార దృక్పథం కాకుండా మానవతా భావంతో సేవ చేయడం మా లక్ష్యం. త్వరలో ఉచిత మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించనున్నాము” అని తెలిపారు. మా
రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్ లో ముఖ్య స్కిన్ & హెయిర్ ట్రీట్మెంట్స్ స్కిన్ ట్రీట్మెంట్స్ మొటిమలు మొటిమల
మచ్చలు, వార్ట్స్, స్కిన్ అలర్జీ చికిత్స హెయిర్ ట్రీట్మెంట్స్: హెయిర్ ఫాల్ కంట్రోల్ థెరపీ మొటిమలు, పిగ్మెంటేషన్, యాంటీ ఏజింగ్, కెమికల్ పీల్స్, లేజర్ ట్రీట్మెంట్స్ హెయిర్ ఫాల్ కంట్రోల్ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయనీ తెలిపారు , వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని బ్రాంచ్‌లు ప్రారంభించి సేవలను విస్తరించనున్నట్లు వారు పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన స్కిన్ మరియు హెయిర్ కేర్ సేవలు ఇప్పుడు చైతన్యపురిలో అందుబాటులోకి రావడం ఆనందకరమైన విషయం అని హాజరైన వారు అభినందించారు.