నెల్లూరు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 19: *వి.పి.ఆర్. సాధారణ రాజకీయ నాయకుడు కాదు, అసాధారణ సేవకుడు, ప్రజా నాయకుడు. ఎంపీ గా గెలిచిన 10 నెలల వ్యవధి లో వి.పి.ఆర్. చేసిన అభివృద్ధి రికార్డ్ మరెవరికి సాధ్యం కానిది. *సొంత నిధులను వెచ్చించి సేవా కార్యక్రమాలు, అభివృద్ధి ని చేపడుతున్న గొప్ప వ్యక్తి వి.పి.ఆర్.
*నూతన పరిశ్రమలు, జాతీయ రహదారుల విస్తరణ, కేంద్ర నిధులతో జిల్లా ను అభివృద్ధి బాట పట్టించారు వి.పి.ఆర్. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం ను పురస్కరించుకొని శనివారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర ముదిరాజ్ సాధికార సమితి కన్వీనర్ పి.యల్.రావు ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా టిడిపి నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి హాజరయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి, కార్యక్రమానికి విచ్చేసిన టిడిపి నేతలకు తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు.ఈ సందర్బంగా టిడిపి నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ………….రాజకీయాల్లోకి రాక మునుపే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి జిల్లా వాసుల మన్ననలు పొందిన మహోన్నత వ్యక్తి వి.పి.ఆర్. అని తెలిపారు.అమృతధార పేరిట ఉచిత త్రాగునీరు ప్లాంట్ లు, ఉచిత విద్య, వైద్యం తో పాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన ట్రై సైకిళ్లను జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు అందించి తన గొప్ప మనసును చాటుకున్న వ్యక్తి వి.పి.ఆర్ అని అన్నారు.వి.పి.ఆర్. రాజకీయ నాయకుడు కాదు, సేవకుడు. ఎన్నికలకు ముందు వారు చేసిన సేవా కార్యక్రమాల కన్నా ఎంపీ గా గెలిచాక చేసిన సేవా కార్యక్రమాలే అందుకు ఋజువు అని తెలియజేశారు.
కోవూరు నియోజకవర్గం లో వ్యవసాయానికి ఉపయోగపడే పంట కాలువలను త్రవ్వించి రైతులకు మేలు చేకూర్చారు వి.పి.ఆర్. సొంత నిధులను వెచ్చించి కాలువలను అభివృద్ధి చేశారు అని అన్నారు.
కేంద్రం నుంచి నిధులను రప్పించడమే కాక ఎన్నో పరిశ్రమలను నెల్లూరు బాట పట్టించారు. దాదాపు 80 వేల కోట్ల పై చిలుకు పెట్టుబడులతో రామాయపట్నం పోర్ట్ లో బీపీసీఎల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు వి.పి.ఆర్. ఘనతే అని తెలిపారు. కోవూరు నియోజకవర్గం అభివృద్ధి కై కేంద్ర నిధులను వి.పి.ఆర్. రప్పించారు. కేంద్రం నుంచి కోవూరు నియోజకవర్గం కు చేనేత క్లస్టర్ తీసుకువచ్చారు అని అన్నారు.
జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధి కోసం, ప్లై ఓవర్ల మంజూరు కోసం కేంద్ర స్థాయిలో వి.పి.ఆర్. విశేష కృషి చేశారు అని అన్నారు. పార్లమెంట్ సభ్యులు గా గెలిచిన 10 నెలల వ్యవధి లో, గతం లో ఎవరూ చేయని విధంగా జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిన ఘనులు వి.పి.ఆర్. అని అన్నారు.
అనంతరం ముదిరాజ్ సాధికార సమితి కన్వీనర్ పి.యల్.రావు మాట్లాడుతూ……………..
సేవ కు ప్రతిరూపం వి.పి.ఆర్. ట్రస్ట్ ద్వారా ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి వి.పి.ఆర్. అని అన్నారు. జిల్లా అభివృద్ధి తో పాటు జిల్లా వ్యాప్తంగా చేపట్టే సేవా కార్యక్రమాల కోసం సొంత నిధులను వెచ్చించే గొప్ప వ్యక్తి వి. పి ఆర్. అని తెలిపారు. వి.పి.ఆర్. చొరవ తో జిల్లా అభివృద్ధి వేగం పుంజుకుంది. నిధుల వెల్లువ, పరిశ్రమల రాక తో జిల్లా రూపు రేఖలు మారుతున్నాయి అని తెలియజేశారు.వి.పి.ఆర్. జన్మదిన వేడుకలతో జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. వాడవాడల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అని తెలియజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వి.పి.ఆర్. మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని, ఆయురారోగ్యాలతో పాటు సిరిసంపదలతో వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జన్ని.రవణయ్య, టిడిపి నగర అధ్యక్షులు మామిడాల. మధు, పార్టీ కార్యాలయం కార్యదర్శి ఊరందూరు సురేంద్ర బాబు, తెలుగు మహిళ అధ్యక్షురాలు పనబాక. భూలక్ష్మి, దొడ్డపనేని రాజానాయుడు, ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ పాల్ శెట్టి, వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణ, ఐటీడీపి అధ్యక్షులు షేక్ రసూల్,కప్పిర శ్రీనివాసులు, కంచి జ్ఞానేంద్ర, పొత్తూరు శైలజ, కప్పిర రేవతి, బిసి సెల్ నేత రాజా, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి కొమరి.విజయమ్మ, ఉప్పు భాస్కర్, నారా శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    శంఖవరం మన న్యూస్ (అపురూప్):ఆంధ్రాలో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సారి చాలా మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించారు.చదువుకునే రోజుల్లో 10వ తరగతి చాలా ముఖ్యమైనది. అందుకే విద్యార్థులు విద్యాసంవత్సరం మెుదటి నుంచే సన్నద్ధం…

    మండల స్థాయి లో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు

    మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లోని శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటి మండల స్థాయిలో మొదటి స్థానం తూపిరి వైష్ణవి 595 మార్కులు, ద్వితీయ స్థానం పి. రేవంత్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

    ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

    • By APUROOP
    • April 24, 2025
    • 4 views
    కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

    పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

    ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    ఉగ్రవాద దాడులను నిరసిస్తూ  కొవ్వొత్తుల ర్యాలీ

    శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..