

మన న్యూస్ కాకినాడ (అపురూప్) : శంఖవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని దోషులందరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ సాధన సమితి, దళిత సంఘాల నేతలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ను కోరారు. గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ ను నేతలు కలిసి శంఖవరం సంఘటనపై జరుగుతున్న పరిణామాలను ఎస్పీకు వివరించారు. పోలీసులు ఈ కేసులో సర్వయంగా దర్యాప్తు చేసి దొండగుడు పడాల వాసు ను అరెస్టు చేసి రిమాండ్కు పంపడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అయితే దుండగుడు పడాల వాసుతోపాటు మరి కొంతమంది ఈ ఘటనలో పాల్గొన్నందున వారిపై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. దుండగులపై అట్రాసిటీ కేసుతోపాటు రాజ ద్రోహం కేసు నమోదు చేయాలని, నిందితులను కాపాడేందుకు ప్రయత్నం చేయొద్దని అన్నారు. దీనిపై స్పందించిన ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఈ కేసులో పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు జరిపి వేగవంతంగా నిందితుడిని పట్టుకున్నామని, నేతలు తెలిపిన అంశాలపై కూడా దర్యాప్తు వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిన్య సాధన సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ భానుమతి, నవీన్ రాజ్, ఉపాధ్యక్షులు పిల్లి రామారావు, కోశాధికారి రాజా రాంజి, సభ్యులు నాగేశ్వరరావు, దళిత సంఘ నాయకులు పండు అశోక్ కుమార్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.